మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏ రిలే దీక్షలు.
ఫోటో రైటప్: రిలే నిరాహారదీక్షలో విఆర్ఏలు.
బెల్లంపల్లి, జులై 27, (జనంసాక్షి)
విఆర్ఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట విఆర్ఏలు రిలే నిరాహారదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ అజ్గర్ అలీ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 23000 వేల మంది విఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవర్చనందుకు సమ్మె కు వెళ్ళడం దిగమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు అసెంబ్లీ లో నూతన రెవెన్యూ చట్టం తీసుక వస్తు 2020 సెప్టెంబర్ 9న విఆర్ఏలకు పే స్కేల్, అర్హత కలిగిన వారికి ప్రమోషన్, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయిన నేటి వరకు హామీ నెరవేరకపోవడం వలన సమ్మె కు వెళ్లక తప్పలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10500 గౌరవ వేతనం తో కుటుంబ పోషణ భారం అయ్యింది. అందరికీ 30శాతం పీఆర్సీ ఇచ్చి విఆర్ఏలకు మొండిచెయ్యి చూపారన్నారు. విఆర్ఏలు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా 24 గంటలు పని చేసినా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. విఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత విఆర్ఏలకు ప్రమోషన్ లేకుండా పోయింది. ఇప్పటి కి అయిన ప్రభుత్వం స్పందించి హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరాల్లో బెల్లంపల్లి, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాల విఆర్ఏలు పాల్గొన్నారు.