మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకలను మంత్రి హాజరయ్యారు.