మూడు వికెట్ల నష్టంతో ఇంగ్లాండ్
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. కుక్ జడేజా బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా ఔటయ్యాడు. రెండో వికెట్ ను అశ్విన్ తీసుకున్నాడు. లంచ్ కు ముందు డకెట్ అశ్విన్ బౌలింగ్ లోనే రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రూట్ 35 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ లో బ్యాట్స్ మన్ రూట్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 155 పరుగులు.