మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా
ప్యాంగ్‌యాంగ్: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో కూడిన కృత్రిమ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తాము గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు మీడియాకు తెలిపారు. మానవ నిర్మిత భూకంపాన్ని తాము కూడా నమోదు చేసినట్లు ఉత్తరకొరియాకు సరిహద్దు ప్రాంతమైన ఈశాన్య చైనా అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉత్తర కోరియా అణుపరీక్షలు నిర్వహించినట్లు అమెరికా కూడా ధ్రువీకరించింది. అయితే అణు పరీక్షల నిర్వహణపై ఉత్తరకొరియా ఇంతవరకూ స్పందించలేదు. ఉత్తర కొరియా 2006,2009లో రెండుసార్లు అణుపరీక్షలు నిర్వహించింది.