మూడో రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ పల్లెబాట మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పల్లెలన్ని గులాబీ జెండాలతో కళకళలాడుతున్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సహంతో ఉరకలేస్తూ పల్లెబాట చేపడుతున్నారు. వాడవాడన జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. కళాకారులు ఆటపాటలతో జనాలను హుషారేత్తిస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతలు పల్లెబాటలో పాల్గొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు సామాన్య జనానికి వివరిస్తున్నారు. సీమాంధ్ర పార్టీలను భూ స్థాపితం చేయాలని పిలుపునిస్తున్నారు. పాదయాత్రలు వారిస్వంత ప్రయోజనాలకు చేసుకుంటున్నారని తెలుపుతున్నారు. తెలంగాణను అడ్డుకున్న బాబును నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.