మూసి ప్రక్షాళనకై సీపీఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

మోత్కూరు ఆగస్టు 20 జనంసాక్షి : మూసీ జల కాలుష్య విముక్తికై మూసీ ఆయ కట్టులో గోదావరి, కృష్ణ జలాల సాధనకై ఈ నెల 21నుండి 28 వరకు జరిగే సిపిఎం పోరు యాత్రను రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోల్లు యాదగిరి కోరారు. శనివారం మోత్కూరు పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సిపిఎం పోరు యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అనేక పార్మ కంపెనీ నుండి కలుషిత వ్యర్ధాలు మూసిలో కలవడం వల్ల ప్రజలకు అనేక అంటు వ్యాధులతోపాటు, క్యాన్సర్ కు కారణమయ్యే ప్రమాదకరమైన  కిటకాలు మూసిలో ఉన్నాయని,సారవంతమైన నేలలు పనికిరాకుండా పోతున్నాయని అనేక సర్వేలు , పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న, పాలక ప్రభుత్వాలు మూసి నీళ్లను ప్రక్షాళన చేయకుండా సుందరీకరణ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి తక్షణమే గోదావరి, కృష్ణ జలాలను  ద్వారా మూసి పరివాహక ప్రాంతాల రైతులకు, మరియు  బునాది కాల్వపూర్తిచేసి,ఆత్మకూరు,మోత్కూరు,అడ్డగూడూరు,మండలాలకు సాగు,త్రాగు,నీరు అందించాలని, వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, సీఐటీయూ నాయకులు కూరేళ్ళ రాములు,కూరేళ్ళ నర్సింహ,పట్టణ కమిటీ సభ్యులు కందుకూరి నర్సింహ,చింతకింది సోమరాజు,మెతుకు అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు