మృతుచెందిన యువతి ఆచూకీ గండిపేట వద్ద లభ్యం
హైదరాబాద్, జనంసాక్షి: గండిపేట వద్ద మృతిచెందిన యువతి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు మాసబ్ ట్యాంక్‌కు చెందిన సానియాగా పోలీసులు గుర్తించారు. ఫంక్షన్‌కి వెళ్తానంటూ ఇంటి నుంచి కారులో బయలుదేరిన సానియా శవమైతేలడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. సానియా ఓ సంస్థలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.