మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీటీసీ డా. ఆకవరం లక్ష్మణ చారి
మోత్కూరు ఫిబ్రవరి 28 జనం సాక్షి : మండలంలోని దత్తప్పగూడెం గ్రామపంచాయతి స్విపర్ గా పనిచేస్తున్న ముక్కర్ల యాదయ్య సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్బంగా దత్తప్పగూడెం ఎంపీటీసీ డా. ఆకవరం లక్ష్మణ చారి, యాదయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం గా అందించారు. ఈ కార్యక్రమంలో గుండు యాదయ్య, గ్రామ పంచాయతీ సెక్రటరీ నర్సయ్య ఉన్నారు.