మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండల కేంద్రానికి చెందిన గుండాలే దీపక్-అనిత దంపతుల కుమారుడు ప్రజ్వల్(9)ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇట్టి విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం రోజున  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.అలాగే బొందిడి గ్రామ పరుశురాం మాజీ సర్పంచ్ అమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అటునుంచి తర్నం గ్రామ లక్ష్మారెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఒకే రోజు ముగ్గురు బాధిత కుటుంబాలను పరామర్శించి మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ప్రగాఢ సానుభూతిని తెలిపి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట మండల ఎంపీపీ రాథోడ్ సజన్ శివారెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు మహేందర్ జాధవ్ తదితరులు ఉన్నారు.