మృతుల కుటుంబాలను పరామర్శించిన బలరాంజాదవ్.

నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండలంలోని కుమారి గ్రామానికి చెందిన బిక్క బక్కన్న ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అదే గ్రామానికి చెందిన భూతి నారాయణ విఆర్వో  మరణించారు.వారి ఇంటికి వెల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాంతో పాటు పోత రెడ్డి విఆర్ఎ రాజు శ్రీధర్ రాజశేఖర్ ప్రశాంత్ ఉషన్న తదితరులు ఉన్నారు.