*మెట్పల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి, యజ్ఞ మహోత్సవం*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 17
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో విశ్వకర్మ జయంతి వేడుకలు, ఆచార్యులు వేద పండితులు, పురోహితులు రామబ్రహ్మం, ప్రవీణ్ ఆచార్యులు, మారుతి ఆచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా , గాయత్రీ దేవి విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సోదరులు , మహిళామణులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని, ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మరియు విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది కోట్ల బడ్జెట్ కేటాయించాలని, సబ్సిడీ లోన్లు , వృత్తి పనిముట్లు ఉచితంగా అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశ్వకర్మ జెండాలతో పట్టణ పురవీధుల గుండా బైక్ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సాయంత్రం గాయత్రి మాత విశ్వకర్మ భగవాన్ రథోత్సవం పట్టణంలోని పురవీధుల గుండా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి ,ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు ప్రవీణ్, బులియన్ అధ్యక్షులు వంగల మహేష్, నాంపల్లి రాజేందర్, బులియన్ ప్రధాన కార్యదర్శి తిప్పర్తి వెంకటేష్, తాడూరి శ్రీనివాస్, బెజ్జారపు నవీన్, నాంపల్లి సంజీవ్ మారోజు సురేష్ , ఇల్లెందుల కృష్ణమాచారి ,తునికి భూమయ్య, రమేష్, నాంపల్లి శ్రీనివాస్ స్వర్ణకార కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీపాద సతీష్ , ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి హరీష్, బెజ్జారపు రఘ, కలికోట లక్ష్మణ్, శ్రీరాం ప్రసాద్ ,ఇల్లెందుల మురళి, కోటగిరి తిరుమల చారి, నాంపల్లి మారుతి, భూమేశ్వర్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు