*మెట్పల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశం

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 28 :
జనంసాక్షి
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం లో చైర్పర్సన్ రాణవేణి సుజాత ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని మిషన్ భగీరథ పైప్లైన్ పనుల జాప్యం వలన, సమస్యలు ఎక్కువగా రావడంతో సంబంధిత సూపర్వైజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు,ఈ దసరా లోపు 26 వార్డులలో సమస్యలు పూర్తి చేయాలని 26 వార్డులలో మంచినీటి సరఫరా పై ఏ ఫిర్యాదు లేకుండా వార్డు కౌన్సిలర్ తో సమన్వయం చేసుకుంటూ అట్టి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. కోరుట్ల నియోజకవర్గం నుండి కోరుట్ల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంక్ సాధించడం గర్వకారణంగా ఉన్నందున మెట్పల్లి మున్సిపాలిటీ కూడా ఇలాంటి ర్యాంకు సాధించుకోవాలని తెలియజేశారు. కౌన్సిలర్ మర్రి సహదేవ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకు సాధిస్తామని ఎమ్మెల్యే కు సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది.ఇట్టి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన 25 అంశాలను కౌన్సిల్ సభ్యులు అంశాల వారీగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించినారు. ఇట్టి సమావేశమునకు చైర్ పర్సన్ రాణవేణి సుజాత అధ్యక్షతన ప్రవేశపెట్టిన అన్ని అంశాలకు వైస్ చైర్మన్ తో సహా కౌన్సిల్ సభ్యులు ఆమోదించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, కో – ఆప్షన్ సభ్యులు, మిషన్ భగీరథ అధికారులు, ఇతర శాఖల అధికారులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.