మెట్ల వద్ద మూత్రం వద్దన్నందుకు కాల్సిచంపాడు
న్యూఢీల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది, ఇంటి మెట్లపై మూత్ర విసర్జన చేయవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మరణించింది. అమె తల్లి అస్పత్రిలో చికిత్స పోందుతోంది. అతని జరిపిన కాల్పుల్లో బిన్నో అలియాస్ గుడియా అనే బాలిక గాయపడగా, అమె తల్లి సద్మాని గాయపడింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం – దక్షిణ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌లోని ఇ- బ్లాక్‌లో సద్మాని అనే మహిళ నివాసం ఉంటోంది. తన ఇంటి పక్కనే ఉంటున్న జావేద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి సద్మాని ఇంటి గేటు వద్ద మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించాడు.అది గమనించి సద్మాని, కూతురు బిన్నో వద్దని చెప్పారు. దీంతో అతను కోపంగా వారిని దుర్బాషలాడాడు.జేబులోని తుపాకి తీసి కాల్పులు జరిపాడు. అతను జరిపిన కాల్పుల్లో కూతురు శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయి మరణించింది. తల్లి శరీరంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే వారిని స్థానికులు ఎయిమ్స్ అస్పత్రికి తరలించారు. కూతురు అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జావేద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.కాల్పులు జరిగినప్పుడు గుడియా 14 ఏళ్ల సోదరుడు, తండ్రి అస్లామ్ ఇంట్లో లేరు. ప్రగతి మైదానంలోని బంకెట్ హల్ వాటికలో తండ్రి రాత్రి విధులకు వెళ్లాడు. అతను అక్కడ టేకర్‌గా పనిచేస్తున్నాడు. పోస్టు మార్టం తర్వాత గురువారం సాయంత్రం గుడియా మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.