మెడికల్ క్రీడా కోటాలో అవినీతి చెద
బయటపడ్డ జూడోలో సర్టిఫికెట్ల బాగోతం
వరంగల్,జూలై13(జనం సాక్షి): క్రీడా మెడికల్ సీట్లలలో భారీగా అవినీతి జరిగింది. రాష్ట్ర స్థాయిలో సోర్ట్స్ నిభాగంలో భారీగా అవినీతి జరగడంతో వరంగల్లో ఏసిబి అధికారులు దాడులు చేస్తున్నారు . ఖిలా వరంగల్ మధ్యకోటలో అల్ ఇండియా జుడో ట్రెజరర్ కైలాష్ యాదవ్ ఇంటిపై ఏసిబి దాడులలో అనేకమైన ఫేక్ సర్టిపికెట్స్ బయటపడడం జరిగింది .కైలాసం యాదవ్ ఇంట్లో దాడులు నిర్వహించి కోన్ని సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ సర్టిపికెట్స్ తో అనర్హులు స్పోర్ట్స్ కోటలో 2017-18 సంలో యంబిబియస్ నాలుగు సీట్లు పోందారని బయట పడింది.అందులో నలుగురికి గాంధీ మెడికల్ కాలీజీలో సిట్స్ వచ్చాయి. 2017 -18 విద్యా సంవత్సరలో స్పోర్ట్స్ కోట క్రింద తెలంగాణలో 11 మెడికల్ సిట్స్ వస్తేఅందులో 7 సిట్స్ వరంగల్ నుంచి వచ్చాయి. అందులో 4 జూడో నుంచే వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన ఏసిబి అధికారులు తీకలాగితే డొంకంతా కదిలింది .వరంగల్ చెందిన తోట సునిల్ తన కుమారుడు సిట్ కోసం కైలాసం యాదవ్ సంప్రదించగా నాలుగు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.మెదట లక్ష సర్టిఫికెట్ ఇచ్చక లక్ష మేడికల్ కాలేజ్ లో అడ్మిషన్ వచ్చక మిగతా 2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తోట సునిల్ అనుకున్న ప్రకారం మెదటి రెండవ విడుతగా 2లక్షలు చెల్లించారు. మిగిలిన 2 లక్షల కోసం ఇద్దరి మధ్య సయోద్య కుదరకాపోవడంతో సునిల్ ఏసిబీ అధికారులను అశ్రయించారు. దీంతో ఏసిబీ అధికారులు దాడులు చేశారు.