మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించడాం పట్ల హర్షం వ్యక్తం చేసిన

– మంత్రి సత్యవతి రాథోడ్

కురివి ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీకి ఈ ఏడాది నుండి ఎంబిబిఎస్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీలు నిర్మించారని,అందుకు జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధుల తరుపున కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌకర్యాలను ది

మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిందని,ఈ బోర్డు నివేదిక ఆధారంగా ఎన్ఎంసీ (NMC)150 సీట్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేటాయించిన నిధులతో మెడికల్ కళాశాల భవనం,పరిపాలనా భవనం,విద్యార్థి సిబ్బంది వసతి గృహాల నిర్మాణం చేపట్టమన్నారు. మానుకోట జిల్లా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రజా సంక్షేమే ప్రభుత్వ దేహమని అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు,టిఆర్ఎస్ పార్టీకి మానుకోట జిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె తెలిపారు.