మెదక్‌లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

మెదక్‌: మెదక్‌ జిల్లా కల్హేరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.