మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌: అన్ని ఛార్జిషీట్‌లు ఒకేసారి విచారణ చేయాలన్న జగన్‌, విజయసాయిల మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్‌ కంపెనీల్లో ‘నీకిది-నాకిది’ కింద పెట్టుబడులు వచ్చాయనడానికి ఆధారాలున్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటి వరకూ 5 ఛార్జిషీట్లు దాఖలు చేశామని.. మరో 6 అంశాలపై దర్యాప్తు సాగుతోందని చెప్పింది. దాల్మియా, వాన్‌పిక్‌లపై దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ప్రస్తుత మంత్రులు నిందితులుగా ఉన్నారని వెల్లడించింది. జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులకు పలురకాల కుట్రలు ఉన్నాయని తెలిపింది. ప్రతికుట్ర, నేరానికి ఒకే శిక్ష వేయాలని చట్టం చెప్పడం పేర్కొంది. జగన్‌ కంపెనీల్లోకి నిధులు రావడంలో విజయసాయిరెడ్డిదే ప్రధాన పాత్ర అని చెప్పింది.