మెరిసిన పసిడి 

– పది గ్రాముల బంగారరం ధర రూ.31,340
న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : గురువారం రూ.120 పెరిగిన పసిడి ధర వరుసగా రెండో రోజు పెరిగింది. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో శుక్రవారం పసిడి ధర రూ.140 పెరిగింది. దీంతో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.31,340కి చేరింది. పండగను పురస్కరించుకొని స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ పెరగడం, అంతర్జాతీయంగానూ సానుకూల పరిస్థితులు ఉండటంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా రెండో రోజు కూడా వెండి ధరలో ఎటువంటి మార్పులు లేవు. కేజీ వెండి ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,400గా ఉంది. నిన్న కూడా వెండి ధర ఇదే విధంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్‌లో 0.60 పెరగడంతో ఔన్సు 1,206.80 డాలర్లు పలికింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ నేడు రూ.71కి చేరి జీవనకాల గరిష్ఠానికి చేరడంతో దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.