మేల్కోటేలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు

ప్రత్యేక ఆకర్షణ కానున్న జానపదోత్సవాలు

బెంగళూరు,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ప్రముఖ ధార్మిక క్షేత్రం మేలుకోటలో 12న రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి జానపద కళామేళా ప్రత్యేక ఆకర్షణకానుంది. రథసప్తమి సందర్భంగా మేలుకోటను సందర్శించే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు నిమగ్నమైనారు.ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి 9.30 గంటల వరకు హులివేష, డొళ్లు కుణిత, సోమనకుణిత, మరగాలు, వీరమక్కళ కుణిత, చక్రదబళె, జడె కోలాట, దొణ్ణెవరస, కీలు కుదురె, తమటమేళ, పూజాకుణిత, యక్షగాన పాత్రధారుల వేషం, కరిడి మజలు.. ఇలా 50కి పైగా జానపద కళాబృందాలు ప్రదర్శనలో పాల్గొంటాయి. కర్నాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి కళా బృందాలు హాజరు కానున్నాయని నిర్వాహకులు తెలిపారు.