మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

` మరో రెండు వారాల‌ కొనసాగిస్తూ కేంద్ర నిర్ణయం

` కొత్త జోన్లను ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ

` రెడ్‌,గ్రీన్‌,  ఆరెంజ్‌ జోన్ల వారీగా మార్గదర్శకాు

` కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ వ్లెడి

న్యూఢల్లీి,మే 1(జనంసాక్షి): లాక్‌డౌన్‌ ఉత్కంఠకు తెరపడిరది. మరో రనెండు వారాు ఇంటికే పరిమితం చేస్తూ లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎంతో ఉత్కంఠతో వెయిట్‌ చేస్తోన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ సంచన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో లాక్‌డౌన్‌ ముగుస్తోన్న నేపథ్యంలో కొన్ని రాష్టాల్లో కేసు, మరణా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడిగించాని సీఎరు నిర్ణయం తీసుకున్నారు. కొందరు ముఖ్యమంత్రు మాత్రం ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా కొన్ని ప్రాంతాకే ఇది పరిమితం చేయాని అనుకున్నారు. అయితే కేంద్ర హోం శాఖ చాలా మంది అంచనాు త్లకిందు చేస్తూ మరో రెండు వారా పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ సంచన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెకొంది. రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాను కేంద్రం జారీ చేసింది. ఇక శనివారం ఉదయం 10 గంటకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించ నున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా విమానాు, రైళ్లు, మెట్రో సర్వీసు, అంతర్‌ రాష్ట్రా మధ్య రాకపోకు, పాఠశాలు, కళాశాలతో పాటు శిక్షణ, కోచింగ్‌ సంస్థపై నిషేధం విధించారు. రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొత్త మార్గదర్శకాు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాు, ఆటో రిక్షాు, ట్యాక్సీు, క్యాబ్‌ు, బస్సు, కటింగ్‌ షాపుపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొత్త మార్గదర్శకాు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాు, ఆటో రిక్షాు, ట్యాక్సీు, క్యాబ్‌ు, బస్సు, కటింగ్‌ షాపుపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షు సడలింపు ఇచ్చారు. రాత్రి 7 గంట నుంచి ఉదయం 7 గంట వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితిని పరిశీలించనున్నారు. కేసు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లగా మార్చనున్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాకు అనుమతి ఇచ్చారు. గ్రీన్‌ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంట వరకు వ్యాపారాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాకు అనుమతి ఇచ్చారు. కార్లలో ఇద్దరికి, టూ వీర్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారుకొత్త జోన్లను ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖకేంద్ర ఆరోగ్యశాఖ కరోనా జోన్లపై కొత్త జాబితాను రిలీజ్‌ చేసింది. దేశంలో కరోనా వైరస్‌ కేసు ఉన్న ప్రాంతాను మూడు జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన జోన్ల వివరాను వ్లెడిరచింది.  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ ఈ వివరాను తెలిపారు. ఆయా రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతాకు ఆమె దీనికి సంబంధించి లేఖు రాశారు.  వివిధ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తూ జాబితాను రిలీజ్‌ చేశారు.  రికవరీ రేటు పెరిగిన తర్వాత కొత్తగా ఈ జోన్ల జాబితాను తయారు చేశారు. తాజా జాబితా ప్రకారం 130 జిల్లాు రెడ్‌ జోన్‌లో, 284 ఆరెంజ్‌ జోన్‌, 319 గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 35 మే దాటింది.  మరణించిన వారి సంఖ్య 1147గా ఉన్నది. తెంగాణలో ఆరు రెడ్‌ జోన్లు, 18 ఆరెంజ్‌ జోన్లు, 9 గ్రీన్‌ జోన్లు ఉన్నాయి. ఇకపోతే ఎపిలో 13 జిల్లాల్లో ఐదు రెడ్‌జోన్లు,ఏడు ఆరెంజ్‌ జోన్లు, ఒకటి గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షపై సడలింపు ఉంటాయని వార్తు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాను గుర్తించింది. రాష్ట్రా వారిగా ప్రస్తుత పరిస్థితును పరిగణలోకి తీసుకుని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుద చేసిన జాబితాలో తెంగాణలోని ఆరు జిల్లాు రెడ్‌ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారా క్రితం సుమారు 170 హాట్‌స్పాట్‌ జిల్లాను ప్రస్తుతం 129కి తగ్గించింది. తెంగాణలోని  రెడ్‌ జోన్లుగా హైదరాబాద్‌, సూర్యాపేట,రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లాు ఉన్నాయి. మరోవైపు కరోనా  తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పు ప్రాంతాను ఆరెంజ్‌ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారా కింద ఆరెంజ్‌ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెంగాణలో ఆరెంజ్‌ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాను ఆరెంజ్‌ జోన్లుకు గుర్తించింది ఆరెంజ్‌ జోన్లు జాబితాలో నిజామాబాద్‌,జోగులాంబ గద్వా,నిర్మల్‌,నల్గొండ,ఆదిలాబాద్‌ రంగారెడ్డి, కామారెడ్డి,ఆసిఫాబాద్‌, కరీంనగర్‌,ఖమ్మం,మహబూబ్‌నగర్‌,జగిత్యా,రాజన్న సిరిస్లి,మెదక్‌, భూపాపల్లి,జనగామ, నారాయణ్‌పేట,మంచిర్యా ఉన్నాయి. తెంగాణలో గ్రీన్‌ జోన్లుగా పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌, ముగు,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌,సిద్దిపేట,వరంగల్‌ రూరల్‌,వనపర్తి యాదాద్రి భువనగిరి ఉన్నాయి.రెడ్‌ జోన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షు కఠినంగా ఉంటాయి. ఎపిలో కర్నూు,గుంటూరు,చిత్తూరు, కృష్ణా, న్లెూరు జిల్లాలో రెడ్‌ జోన్ల పరిధిలో ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్లలో ఉభయగోదావరి జిల్లాు, విశాఖపట్టణం, శ్రీకాకుళం, కడప, అనంతపురం ప్రకాశం ఉన్నాయి. గ్రీన్‌ జోన్‌లో విజయనగరం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్ల సంఖ్య తగ్గింది. గత 15 రోజుల్లో ఆ సంఖ్య 23 శాతం తగ్గినట్లు అధికాయి చెప్పారు. ఏప్రిల్‌ 15వ తేదీన 170గా ఉన్న రెడ్‌ జోన్ల సంఖ్య.. ఏప్రిల్‌ 30వ తేదీకి 130కి చేరుకున్నది. ఎటువంటి కొత్త కోవిడ్‌ కేసు లేని గ్రీన్‌ జోన్ల సంఖ్య కూడా 356 నుంచి 319కి తగ్గింది. అంటే వైరస్‌ కొత్త ప్రాంతాకు విస్తరిస్తున్నట్లు అధికాయి ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆరెంజ్‌ జోన్లు మాత్రం పెరిగాయి.  207 నుంచి 284 వరకు ఆ జిల్లా సంఖ్య పెరిగింది. రెడ్‌,ఆరెంజ్‌ జోన్లలో కంటైన్మెంట్‌ చర్యు పటిష్టంగా ఉండాన్నట్లు ప్రభుత్వం తన లేఖలో పేర్కొన్నది.