మైనార్టీ వార్డులో రాపిడ్ ఫీవర్ క్యాంప్.

జనం సాక్షి ఉట్నూర్.
నార్నూర్ మండల కేంద్రంలోని నార్నూర్ గ్రామపంచాయతీ మైనార్టీ వార్డులో మంగళవారం నాడు  పీహెచ్ హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ దాస్ ఆధ్వర్యంలో రాపిట్ ఫీవర్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధి గురించి వివరంగా చెప్పి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యవ్వ ఏఎన్ఎం షీలా హెల్త్ అసిస్టెంట్ ఈశ్వర్ నాయక్ బ్లీడింగ్ చకర్ నరేందర్ ఆశా వర్కర్ లక్ష్మి అంగన్వాడీ టీచర్ కవిత గ్రామస్తులు ఉన్నారు.