మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మైనార్టీల అభ్యున్నత కోసం కృషిచేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.
-మైనార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28
జనం సాక్షి.
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల నియోజకవర్గం లోని మైనార్టీల ఆత్మీయ సమావేశానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.మత పెద్దలు ఎమ్మెల్యే కి శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు.ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ముస్లింలకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది . సీఎం కేసీఆర్ ముస్లింల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈమాములు మోజాన్ల కు గౌరవించ వారికి గౌరవ వేతనం మేడం చాలా సంతోషకరమైన అదేవిధంగా మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని కొన్ని గ్రామాలలో ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిశీలించాలని కోరారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ
గతంలో గత పాలకులు గత ప్రభుత్వాలు ముస్లిం సోదరులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాల నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మసీదుల దగ్గర షాదీ ఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా 20 గ్రామాలలో ఉర్దభవన లోని షాది ఖానాలు 30 లక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈద్గా నిర్మాణ పనులను నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి త్వరలో రాష్ట్రంలో ఎక్కువ లేని విధంగా గద్వాల ఈద్గా నిర్మాణం త్వరలో అందుబాటులో రావడం జరుగుతుంది అని తెలిపారు.బిజెపి కాంగ్రెస్ పార్టీలు పరిపాలించే ప్రాంతాలలో మైనార్టీ సోదరులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు యూపీలో ముస్లిం సోదరులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందని ఇటీవలే ఆ ప్రాంతంలో కు వెళ్లి వచ్చిన కొంతమంది మత పెద్దలు చెప్పారు ఆ ప్రాంతాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు స్వేచ్ఛ ప్రశాంతత గౌరవం ఉన్నదని ఈ విషయం ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం హిందూలు సోదర భావంతో అన్న తమ్ములు వలె గ్రామాలలో పట్టణాలలో ఆత్మీయంగా ఉంటే వాటిని చూసి ఓర్వలేక కొంతమంది ముస్లిం హిందువుల సోదర మధ్యల చిచ్చులు పెట్టడానికి వస్తారు కాబట్టి ఈ విషయాలను గ్రహించాలి తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ పాలనలోని ముస్లిం సోదరులు హిందూ సోదరులు అని తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా అందరం సమానమే అనే భావనతో అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. ఇలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరొక్కసారి కాపాడుకోవాలని తెలిపారు.ముస్లిం మైనార్టీ సోదరులు సీఎం కేసీఆర్ ని నన్ను మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని విధాలుగా వారి అండగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేకమైన సంక్షేమ పథకాలలో వారికి ప్రాధాన్యత కల్పిస్తూ గద్వాల లోని షాదీ ఖానా భవనం నిర్మాణం నిధులు కేటాయించి పనులు కొనసాగించడం జరుగుతుందనారు.సీఎం కేసీఆర్ ని గద్వాల ఎమ్మెల్యే ని మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ , మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, జడ్పీ కో ఆప్షన్ నెంబర్,మల్డకల్ మండల కో ఆప్షన్ నెంబర్ ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, కోడిగుడ్ల సలాం, ఖలీల్ , సీసాల పాషా, మోబిన్, రిజ్వాన్, మాము జాన్, రెహమాన్, ఫయాజ్, ఇమ్రాన్, ముస్లిం మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.