మొక్కల సంరక్షణ పై ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలి
జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత…
ముదోల్,జూలై 20 (జనంసాక్షీ)మొక్కల సoరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలనీ నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత అన్నారు.బుధవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గల గ్రామ నర్సరీని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నిర్దేశించిన గడువులోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు వాటి సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీలోని మొక్కల సౌరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఎడబిబ్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం పై దృష్టి సారించింది అంటూ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో తరోడ సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, మండల పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శులు,తదితరులుఉన్నారు.