మోకాళ్ళ పై నిరసన చేసిన విఆర్ఏ లు
ఝరాసంగం జులై 28 (జనంసాక్షి) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకాళ్ళ పై నిలుచుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు తో దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమంటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని అన్నారు. తక్షణమే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అడుగుతున్నది సీఎం హామీలు పే స్కెల్,55సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్స్ మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్, దత్తు,నర్సింహులు,మానయ్య శ్రీశైలం, రాణి సాయన్న, బీరన్న ఇస్మాయిల్ ,తదితరులు ఉన్నారు.




