మోడీతో మాట్లాడడం అరుదౌన గౌరవం: కౌసర్ షాహీన్
వరంగల్,జూలై13(జనం సాక్షి): గత పదేళ్లుగా తను పడిన కష్టం దేశ ప్రధాని నరేద్ర మోదితో పిఎం సంవాద్తో తీరిపోయిందని, అందుకుతనకు చాల సంతోషంగా ఉందని వరంగల్ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్ షాహీన్ ఆనందం వ్యక్తం చేసారు. ప్రధానితో మాట్లాడడం ఒక ఆనందమే గాకుండా అదృష్టమన్నారు. ఇందుకు తనకే అవకాశం రావడం మరింతగా ఆనందాన్ఇన ఇచ్చిందన్నారు. దేశ ప్రధానితో గురువారంఉదయం 9.30 కి దేశంలోని కొన్ని రాష్టాల్రకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు .. రెండు తెలుగు రాష్టాల్రలో ఒక్కరికి వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన కౌసర్ షాహీన్ కు లభించింది. మోదితో మూడు నిముషాలు కౌసర్ మాట్లాడారు. అనంతరం కౌసర్ షాహీన్ మాట్లాడుతూ తన భవిష్యత్ ఏమిటో అర్ధం కాని పరిస్థితులలో ఇంత గొప్ప అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓరకంగా తనకు మాత్రమే దక్కిన అరుదౌన గౌరవమని అన్నారు.
———-