మోడీ మూడు రోజుల్లో..  క్షమాపణ చెప్పాలి


– మాఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గుణపాఠం చెప్పితీరుతాం
– అద్దె జనాలను పెట్టుకొని రాష్ట్రంపై దాడిచేస్తారా?
– కేంద్రం దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు
– విూరిచ్చిన నిధులకు లెక్కలు చెప్పడానికి మేం సిద్ధం
– మేం కట్టిన పన్నులకు విూరు లెక్కలు చెప్తారా?
– విభజన సమయంలో ఇచ్చిన ఏఒక్క హావిూ నెరవేర్చలేదు
– తీరుమార్చుకోకపోతే భూస్థాపితం చేస్తాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్షను చేపట్టిన ఏపీ సీఎం
– ఏపీ నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లిన ప్రజలు
– సంఘీభావం తెలిపిన పలువురు జాతీయ స్థాయి నేతలు
– దీక్షాస్థలికి వచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన రాహుల్‌గాంధీ
– ఏపీ దేశంలో భాగం కాదా అంటూ మోడీని నిలదీత
– మోడీకి గుణపాఠం తప్పదని హెచ్చరించిన రాహుల్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రజలు మోదీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికైనా మూడు రోజుల సమయం ఉందని, చేసింది తప్పని పార్లమెంట్‌లో ఒప్పుకుంటే ఏపీ ప్రజలు క్షమిస్తారని, లేకుంటే శాశ్వతంగా ఈ భాజపాను, నరేంద్రమోదీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారని అన్నారు. ఏపీ చరిత్రలో విూ పార్టీ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీకి ఇచ్చిన విభజన హావిూలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, మోదీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షను చేపట్టారు. దీక్షకు భారీ సంఖ్యలో తెదేపా శ్రేణులు, ఏపీ ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా దేశంలోని పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు సంఘీభావం తెలిపారు. ఫరూక్‌ అబ్దుల్లా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలువురు ముఖ్యులు దీక్షా శిబిరానికి వచ్చిన చంద్రబాబు మద్దతు తెలిపారు. తొలుత దీక్షాస్థలిలో ఏర్పాటు చేసిన గాంధీ, ఎన్టీఆర్‌ తదితర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికైనా మోడీ తప్పు తెలుసుకుని ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రత్యేక ¬దీ ఇవ్వాలని.. ఇందుకు మూడు రోజులు గడువు ఇస్తున్నామని చెప్పారు. లేదంటే ఏపీలో బీజేపీని ప్రజలు శాశ్వతంగా కనుమరుగు చేస్తారని తెలిపారు.  ఏపీకి కేంద్రం అన్యాయం చేసినందుకే ధర్మపోరాట దీక్ష చేస్తున్నామన్నారు. ప్రత్యేక ¬దా, విభజన అంశాల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్నామన్నారు. ¬దా ఇస్తేనే ఏపీ కోలుకుంటుందని విభజన సమయంలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక ¬దీ కావాలని అప్పట్లో పార్లమెంట్‌లో అరుణ్‌ జైట్లీ డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ పెద్దలే ఆ మాట నిలబెట్టుకోలేదని బాబు అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హావిూలను తక్షణమే అమలు
చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని మోడీ హావిూ ఇచ్చారని.. కానీ ఇప్పటికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని బాబు చెప్పారు. మోడీకి పాలించే అర్హత లేదని చంద్రబాబు చెప్పారు. తాము హక్కుల కోసం పోరాడుతున్నామని.. భిక్ష కోసం కాదని స్పష్టం చేశారు.  కేంద్రం నిధులు ఎక్కడెక్కడ ఖర్చుపెట్టామో లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని.. మరి.. తాము కట్టిన పన్నులు ఎక్కడ ఖర్చు చేశారో విూరు చెబుతారా అని మోడీని బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, రూ. 16వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉందని చెప్పారు. కేంద్రం రూ.3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. విభజన చట్టంలోని 18హావిూలను నెరవేర్చాల్సి వుందని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడిల్సిందేనని, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడిల్సిందేనన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకిచ్చిన హావిూలు పరిష్కరించలేదన్నారు. దీనిపై నిలదీయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఏఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఆనాడు భాజపా నేతలే చెప్పారన్నారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక ¬దా పదేళ్లు కావాలని అడిగారని, అలాంటిది ఇంతవరకు ఏ ఒక్క హావిూని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. పోలవరం డీపీఆర్‌ను ఆమోదించలేదన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదని, రెవెన్యూ లోటు తీర్చలేదని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని,
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే ఇక్కడ దీక్షకు కూర్చున్నామన్నారు.
ఏపీ ఈ దేశంలో భాగంకాదా? -రాహుల్‌ గాంధీ
ఆంధ్రాభవన్‌లో దీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హావిూలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. గత ప్రధాని ఇచ్చిన హావిూలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని, ఎక్కడికి వెళితే అక్కడ మోదీ అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనపై ప్రజల్లో నమ్మకం పోయిందని, ఈ దేశ ప్రజల సెంటిమెంట్‌ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తామన్నారు. రఫేల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా అని ప్రశ్నించారు. చౌకీదార్‌ చోర్‌ అయ్యాడని విమర్శించారు.  ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్‌ అంబానీకి దోచి పెట్టారని విమర్శించారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం అంటూ రాహుల్‌ పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన .. ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
చేసింది చెప్పకుండా.. చంద్రబాబుపై విమర్శలా – ఫరూక్‌ అబ్దుల్లా
ఆంధ్రా భవన్‌లో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హావిూలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని.. కేంద్రం ధర్మం తప్పడం వల్లే ఏపీ ప్రజలు ఇక్కడికి వచ్చారన్నారు. దేశవ్యాప్తంగా
ప్రతిపక్షాలను ఏకం చేస్తూ.. చంద్రబాబు మంచి పని చేస్తున్నారని అభినందించారు. ఆంధ్రాలో ప్రధాని మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు. ఏపీకి ఎంత ఇచ్చారో.. ఇచ్చిన హావిూలు ఏమయ్యాయో చెప్పకుండా.. ఈ విమర్శలేంటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా శంకుస్థాపనలు చేస్తున్నారని… పునాదిరాళ్లు మాత్రమే మిగులుతున్నాయని విమర్శించారు. ఈ పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ‘ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని, కర్ణాటకలో చూస్తున్నాం.. ఎమ్మెల్యేలను కొనుక్కోడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు అలా చేస్తున్నారు.. ప్రధానికి దమ్ము లేదు..  పాలించే అర్హత మోదీకి లేదన్నారు.  50 ఏళ్లు పాలిస్తానని అమిత్‌ షా అంటున్నారని, అన్నేళ్లు ముందు బతకాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇతరులను గౌరవించడం నేర్చుకోండని, ఇలా అయితే ఈ దేశాన్ని ఏం ఏలగలుగుతారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని దించేద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.