యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో బతుకమ్మ సంబరాలు ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు.
మల్లాపూర్ ( జనం సాక్షి )సెప్టెంబర్: 24 మండలంలోని కుస్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి . విద్యార్థులు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మ లను పేర్చి , విద్యార్థులు , ఉపాధ్యాయులు , సర్పంచ్ , మాజీ సర్పంచ్ లు ఆట పాటలతో దాండియా ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు . కోలలు వేస్తూ డాన్స్ లు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు . ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునవత్ రాజు , గ్రామ సర్పంచ్ లక్ష్మి మహిపాల్ , మాజీ సర్పంచ్ ద్యాగ గంగారెడ్డి , ఉపాధ్యాయులు షహభాజ్ హుస్సేన్ , శృతి , సునీత , గణేష్ , లహరి , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .