యుద్దవీరులకు బ్రిటన్ నివాళి
లండన్,నవంబర్5(జనంసాక్షి): మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరపున పోరాడిన భారత అమరులకు బ్రిటీష్ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల గౌరవార్ధం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులైన సైనికులకు ఘనంగా నివాళులర్పించింది. లండన్ వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని స్మెత్‌విక్ పట్టణంలో ‘లయన్స్ ఆఫ్ ది గ్రేట్ వార్’ పేరుతో ఈ విగ్రహం నెలకొల్పారు. తలపాగా చుట్టుకున్న ఒక సిక్కు సైనికుడి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.