యువకుడి ఆత్మహత్య
వరంగల్ రూరల్,సెప్టెంబర్1(జనంసాక్షి): వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట కు చెందిన కొల్లూరి కుమారస్వామి తన ప్రేమ విఫలమవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.