యువతి సజీవదహనంపై హోంమంత్రి ప్రకటన

ujfgmey1హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి సజీవం దహనం కేసుపై.. అసెంబ్లీలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటన చేశారు. యువతి సజీవ దహనం ఘటన దురదృష్టకరమన్నారు. హంతకులను పట్టుకోవడానికి మూడు టీంలను రంగంలోకి దించామన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో హంతకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని.. ఆ ఘటన హత్యని తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.