యూనియన్ బ్యాంకు అధికారులు తీరు మార్చుకోవాలి.

– ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మహేందర్.
బెల్లంపల్లి, జులై 24, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని యూనియన్ బ్యాంకు అధికారులు తమ తీరు మార్చుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మహేందర్ సూచించారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్వనిధి రుణాలు మంజూరైన లబ్దిదారులకు ఇవ్వకుండా యూనియన్ బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వనిధి పథకాన్ని యూనియన్ బ్యాంక్ అధికారులు నీరుగారుస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దారిద్రరేఖకు దిగువనున్న వారి కోసం ఈ పథకాన్ని ప్రారంభించారని, అర్హులైన వారిని ఎంపిక చేయడానికి రిసోర్స్ పర్సన్ లకు బాధ్యతలు అప్పగించారని, ఆ సంస్థకు సంబంధించిన అధికారులు అర్హత సాధించిన లబ్ధిదారులను ఎంపిక చేసి వివిధ బ్యాంకులకు జాబితాను బెల్లంపల్లి లోని వివిధ బ్యాంకుల్లో ఇప్పటికే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి ఇవ్వగా, బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం ద్వారా ప్రధాన మంత్రి స్వ నిధి రుణాలు మహిళలకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మహిళలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మిగతా బ్యాంకులు గత నాలుగు నెలల క్రితం రుణాలు ఇవ్వగా బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ గత నాలుగు నెలల నుండి మహిళలను మరియు రిసోర్స్ పర్సన్లను రేపు,మాపు అంటూ నెలలు దాటవేస్తున్నారని. ఇది తగదని, ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ తక్షణమే ప్రధాన మంత్రి స్వనిధి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.