యూపిలో 9 వైద్యకళాశాలలు ప్రారంభం
న్యూఢల్లీి,అక్టోబర్25 (జనంసాక్షి):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్ సిద్దార్థ్నగర్ నుంచి 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కళాశాలలు సిద్దార్థ్నగర్, ఈతా, హర్దోయ్, ప్రతాప్ ఘర్, ఫాతేపూర్, డియోరియా, ఘాజిపూర్, మిర్జాపూర్, జావున్ పూర్ లలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, గవర్నర్ అనందీబెన్ పటేల్లు హాజరయ్యారు.