యూపీలో దారుణం

– రూ.1,500 అప్పు తీర్చలేదని అఘాయిత్యం
– 17ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం
– ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
– నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఘజియాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా రోజురోజుకు మహిళలు, యువతులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా వీటికి అడ్డుకట్ట పడటం లేదు.  తాజాగా యూపీలో దారుణం చోటు చేసుకుంది. రూ. 1,500 అప్పు తీర్చలేదని 17ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం జరిగింది.  ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మురద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలిక కుటుంబఖర్చుల కోసం స్థానికంగా నివసించే జాహిద్‌, మోహన్‌ పాల్‌ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.1,500 అప్పుగా తీసుకుంది. బాధితురాలు చదువు మధ్యలోనే ఆపేసి కుటుంబ భారాన్ని మోస్తోంది. అయితే, అప్పు తీర్చాలని జాహిద్‌ బాధితురాలిపై ఒత్తిడి తీసుకురావడంతో తనకు కొంత గడువు కావాలని కోరింది. గత బుధవారం ఆమె సైకిల్‌పై వస్తుండగా జాహిద్‌, మోహన్‌తో పాటు మరో మైనర్‌ బాలుడు ఆమెను అడ్డుకుని తమ అప్పు చెల్లించాల్సిందిగా అడగడటంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని బాధితురాలిని నిందితులు బెదిరించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సోచట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై ఘజియాబాద్‌ ఎస్పీ వైభవ్‌ కృష్ణ మాట్లాడుతూ.. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశాం. జాహిద్‌
అనేవ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. మైనర్‌ బాలుడు అత్యాచారం చేయలేదు. కానీ నేరానికి సాయపడ్డాడు. కాబట్టి అతడిని అరెస్ట్‌ చేసి జువనైల్‌ ¬ంకు తరలించాం అని తెలిపారు.