యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు అఖిలేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. డెస్క్‌లపైకి ఎక్కి సభ్యులు గవర్నర్‌పై పేపర్లను చించి విసిరివేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది గవర్నర్‌కు రక్షణగా నిలిచారు. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కి సలాట చోటుచేసుకొని 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.