యో-యో టెస్టుకు కోహ్లీ!
న్యూఢిల్లీ, సెప్టెంబర్27(జనంసాక్షి) : ఈ ఏడాది ఫిట్‌నెస్‌కి సంబంధించి కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌కు దూరమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. మరికొద్దిరోజుల్లో వెస్టడీస్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ పాల్గోనున్నారు. దీంతో యో-యో టెస్టుకు హాజరవ్వాల్సిందిగా సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ యో-యో టెస్టుకు వెళ్లనున్నాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి సెప్టెంబరు 28న యో-యో టెస్టుకు హాజరవనున్నాడని సమాచారం. ఇటీవల కాలంలో క్రికెటర్ల తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి యో-యో టెస్టును తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌లో అంబటి రాయుడు, మహమ్మద్ షవిూ యో-యో టెస్టులో పాల్గొనప్పుడు విఫలమయ్యారు. ఇప్పుడు ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత యో-యో టెస్టులో పాల్గొనాల్సి వస్తుంది. అయితే యో-యో టెస్టులో కోహ్లీ సునాయాసంగా పాసవ్వగలడనే అంచనాలున్నాయి. వెన్నునొప్పి కారణంగా ఆసియాకప్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో జట్టు సారథి పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో భాగంగా భారత్ ్గ/నైల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం భారత్-బంగ్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.