రంగసాయిపేటలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
రంగసాయిపేటలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 03 (జనం సాక్షి)రంగశాయిపెట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బండ్ల జాతర సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ స్థల దాతలు వద్దిరాజు రంగారావు, శ్యాం సుందర్ రావు,లక్ష్మీకాంత్ రావు గార్ల ఇంటి ఆవరణ నుండి శ్రీరాముని చిత్రపటంతో భక్తిపాటలు,కోలాటాల నడుమ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో వద్దిరాజు లక్ష్మీ మనోహర్ రావు,శ్రీనివాస్ రావు,ప్రశాంత్, యరబాటి రాజేశ్వర్ రావు,రవికాంత్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.