రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబా దోషి
తేల్చి చెప్పిన సిబిపై ప్రత్యేక కోర్టు
న్యూఢల్లీి,అక్టోబర్8 (జనంసాక్షి) : రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్దారించింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో సీబీఐ ప్రత్యే కోర్టు డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. అక్టోబర్ 12న దోషులందరికీ శిక్షలు ఖరారు చేయనుంది. కాగా, డేరాబాబా ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్దారించింది. తాజాగా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను మరో హత్య కేసులో
దోషిగా పంచకుల సీబీఐ కోర్టు నిర్దారించింది. 2002 సంవత్సరంలో హత్యకు గురైన రంజిత్ సింగ్ కేసులో
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ఐదుగురు నిందితులు దోషులని పంచకుల సీబీఐ కోర్టు శుక్రవారం తేల్చింది.డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మద్దతుదారు అయిన రంజిత్ సింగ్ 2002 జులై 10 న హత్యకు గురయ్యాడు.2003 డిసెంబరు 3న ఈ హత్య కేసును సీబీఐ విచారణకు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.రంజిత్ సింగ్ కుమారుడు జగసీర్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఐపీసీ సెక్షన్ 302 కింద గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ఐదుగురు సహ నిందితులను దోషులుగా నిర్దారించింది. అక్టోబర్ 12 న కోర్టు ఈ దోషులకు శిక్షను ప్రకటించనుంది.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్దారించింది.