రక్తదానం ప్రాణదానంతో సమానం

సుపరిడెంట్  రవీంద్ర మోహన్
ఎల్లారెడ్డి. ఆగస్టు 17 ( జనం సాక్షి ): భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా  బుదవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా  డాక్టర్ సుపరిడెంట్ రవీంద్ర మోహన్  డిప్యూటీ డి యం యచ్ వో  శోభారాణి  మాట్లాడుతూ  రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. అనేక అత్యవసర పరిస్థితులలో దాతలిచ్చిన రక్తం అనేక ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు.  రక్తదాన ఆవశ్యకతను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో రక్తదానానికి ఒక రోజు కేటాయించడం చాలా సంతోషమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవంలో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 75 మంది రక్తదాతలతో రక్తదాన శిబిరంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం. ఆనందకరం అని అన్నారు . నేడు రక్త దానశిబిరం లో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం కలెక్టర్ జితేష్ పాటిల్  అదనపు కలెక్టర్  వెంకటేష్ దోత్రే రక్త దానం చేసిన యువకులను అభినందిస్తూ ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ లను అందజేశారు ఈ కార్యక్రమం లో  రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ రెడ్డి  జిల్లా అధ్యక్షుడు రాజన్న కార్య దర్శి రఘు డివిజన్ అధ్యక్షుడు రవి గౌడ్  మండల అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి  మండల కార్యదర్శి  సిద్దిరమా గౌడ్  డాక్టర్స్  నర్స్ ఆసుపత్రి సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు