రక్త దానం , తలసీమియా వ్యాధిపై అవగాహన సదస్సు
రామకృష్ణాపూర్ (జనంసాక్షి): రక్తదానం, తలసేమియా వ్యాధి పై అవగాహన సదస్సు
మందమర్రి ఏరియా సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం (ఎం.వి.టి.సి)లో శిక్షణ పొందుతున్న కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన నూతన కార్మికుల కు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించబడినది.
ఈ అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా ఎం.వి.టి.సి మేనేజర్ శంకర్ హాజరై, మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు లో 700 మంది తలసేమియా, సికిల్ సెల్ వారున్నారని, వీరికి ప్రతి 15రోజులకు ఒక్కసారి రక్తము ఎక్కించాలిసివుంటుందన్నారు. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న వారికి, గర్భిణి లకు, రక్తహీనత గల్ వారికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తము ఉచితంగా అందించబడుతుందని తెలిపారు.
అమ్మ జన్మనిస్తే, రక్తదాతలు పునర్జన్మణిస్తారని అలాగే ప్రతి రక్తదాత రక్తం దానం చేస్తే ప్రతి తలసేమియా పేషెంట్స్, వారి పోషకులు రక్తం దానం చేసిన వ్యక్తిని భగవంతుని రూపంగా కొలుస్తారని అన్నారు.
కావున ఎం.వి.టి.లో శిక్షణ పొందుతున్న ప కార్మికులు స్వచ్చందంగా రక్తదానం చేసి, తలసేమియా వ్యాధిగ్రస్తులను, ఆదుకోవాలని అన్నారు.
ఇలా సింగరేణి సంస్థ ఉత్పత్తి తో పాటు, సామాజిక సేవలో భాగంగా పలు సంక్షేమ పథకాలతో, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు కు అందిస్తామని అన్నారు.
25నాడు ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ఉంటుంది అని ప్రతి ఒక్కరు గని కార్మికుల, డిపార్ట్మెంట్ కార్మికులు హాజరయ్యి, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో
ఎం.వి.టి.సి.ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్, మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి,
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబెర్ కాసర్ల శ్రీనివాస్, రెడ్ క్రాస్ బెల్లంపల్లి సబ్ డివిజన్ మెంబెర్ సూరం లక్ష్మీ నారాయణ, హెడ్ ఓవర్ మెన్ రాజేశం, లక్ష్మణ్, శ్రీనివాస్, రఘువరన్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు