రగులుతున్న గిరిజనులు
దండేపల్లి మండలం కోయపోష గూడెంలో గత నాలుగు రోజుల నుండి పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజను ల మధ్య గొడవలు రగులుతూనే ఉన్నాయి గిరిజనులు వేసుకున్న గుడిసెలను పోలీసుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు తీసివేశారు అయినప్పటికీ తగ్గేది లేదంటూ గిరిజనులు గుడిసెలను నిర్మించుకుంటున్నారు గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఘర్షణలో అమాయకులైన గిరిజనులను పోలీస్ ఫారెస్ట్ అధికారులు హిస్టారీతిగా కొట్టడంతో కొంతమంది గిరిజనులకు గాయాలు కావడంతో లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు గిరిజనులకు పోడు భూములు లేవని ఫారెస్ట్ భూమిలేనని ఫారెస్ట్ అధికారులు అక్కడే మక్కం వేశారు కూల్చేసిన గుడిసెలలో గిరిజనుల ఆహార ధాన్యాలతో పాటు బట్టలు కూడా పారేసినారు దీంతో చిన్నపిల్ల లు వృద్ధులు వర్షంలో తడిసి ముద్దయినప్పటికీ అధికారులు కనికరం చూపడం లేదని గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసి సంఘం నాయకులు కోరుతున్నారు