రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారు: ఈటెల
హైదరాబాద్ : కుట్రలో భాగంగానే తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావుతో అసత్యాలు మాట్లాడిస్తున్నారని తెరాస నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా గతంలో తెరాసను ఇలానే చీల్చాలని చూశారని అన్నారు. ఆంధ్రనాయకుల, సంపన్నుల కుట్రలో భాగమే తెరాసపై ఆరోపణలని ఆయన పేర్కొన్నారు.