రఫెల్‌పై సుప్రీంలో వాదనలు
విమాన కొనుగోళ్లలో రహస్యమేవిూ లేదని ప్రభుత్వ వాదన
న్యూఢిల్లీ,నవంబర్14(జనంసాక్షి): రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై బుధవారం సుప్రీంకోర్టులో
వాదనలు జరిగాయి. రాఫెల్ ధరలపై రహస్యం ఏవిూ లేదని లాయర్ ప్రశాంత్ భూషన్ తెలిపారు. పార్లమెంట్‌లోనే విమానాల ధరలను వెల్లడించినప్పుడు, దాంట్లో రహస్యం ఏముంటుందని ఆయన అన్నారు. రాఫెల్ ధరలను వెల్లడించలేమని ప్రభుత్వం చెప్పడం ఓ తప్పుడు వాదన అని ఆరోపించారు. కొత్త ఒప్పందం ప్రకారం రాఫేల్ను 40 శాతం ఎక్కువ ధర పెట్టి కొన్నట్లు ఆయన తెలిపారు. అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ ప్రభుత్వం తరపున సుప్రీం ముందు హాజరయ్యారు. అయితే రాఫెల్‌పై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కోర్టులో భారత వైమానిక దళానికి చెందిన ఆఫీసర్లు ఉన్నారా అని చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ప్రశ్నించారు. విమాన ఖరీదులో రహస్యం ఏవిూ లేదని వేణుగోపాల్ అన్నారు. ఆయుధ తయారీ, వైమానిక రహస్యాలను మాత్రం వెల్లడించడం లేదన్నారు. రాఫెల్ ధరకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించామని, కానీ ఆ అంశాలను న్యాయపరంగా సవిూక్షించడం సరికాదు అని అటార్నీ జనరల్ అన్నారు. రాఫెల్ ధర గురించి వివరాలను ప్రభుత్వానికి సీల్డు కవర్లో సమర్పించామని, కానీ రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దాన్ని పబ్లిక్‌గా వెళ్లడించడం లేదన్నారు. ధరల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కోర్టు నిర్ధారిస్తేనే, ఆ అంశాన్ని కోర్టులో చర్చిస్తామన్నారు.