రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్రమీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు.