రాజకీయ కోసం పరామర్శలా
రాహుల్‌పై ఘాటుగా స్పందించిన గోవా సిఎం
అనారోగ్యంతోనే బడ్జెట్ ప్రవేశ పెట్టిన పారికర్
పనాజీ,జనవరి30(జనంసాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా సీఎం మనోహర్ పారికర్ మండిపడ్డారు. తన రాజకీయ మైలేజీ కోసం తననుపరామర్శించడం దారుణమని అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్‌ను రాహుల్ మంగళవారం వ్యక్తిగతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని బుధవారం ఓ సమావేశంలో ప్రస్తావిస్తూ.. రాఫెల్ డీల్‌ను మార్చే సమయంలో ప్రధాని మోదీ రక్షణ మంత్రికి కూడా ఆ విషయం చెప్పలేదు అని పారికర్ నాతో చెప్పారని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పారికర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీ రాజకీయ లబ్ది కోసం నన్ను పరామర్శించావని తెలిసి చాలా బాధ కలుగుతున్నది. అసలు ఐదు నిమిషాల ఆ భేటీలో రాఫెల్ అంశం మన మధ్య చర్చకు వచ్చిందా అని పారికర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ లేఖను కూడా ఆయన విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళ్లి దానిని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకు అని రాహుల్‌కు పారికర్ సూచించారు. నిజాలను విూరే బయటపెడతారని ఆశిస్తున్నానని అన్నారు. విూరు చేసిన ఈ వ్యాఖ్యలు విూ చిత్తశుద్ధిని శంకించేలా ఉన్నాయని రాహుల్‌పై పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విధానం ప్రకారమే రాఫెల్ డీల్ జరిగిందని మరోసారి పారికర్ స్పష్టం చేశారు. ఇకపోతే గోవా అసెంబ్లీలో సీఎం మనోహర్ పారికర్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత చాన్నాళ్లుగా సెక్రటేరియేట్‌కు హాజరుకాని విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సమయంలో ఆయన తన చైర్‌లోనూ కూర్చుని బ్జడెట్‌ను చదివారు. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో ఆయన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. చాలా బలహీనంగా కనిపించిన పారికర్.. ముక్కులో ట్యూబ్‌తోనే అసెంబ్లీకి వచ్చి బ్జడెట్ చదివి వినిపించారు. తనలో జోష్ ఉందని, ఆ ¬ష్‌తోనే చురుగ్గా పనిచేస్తున్నట్లు పారికర్ చెప్పారు. ఏడాది కాలంగా పారికర్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. గత ఏడాది అమెరికాలో ఆయన చికిత్స పొందారు. అక్కడే మూడు నెలల కూడా ఉన్నారు. తర్వాత.. రాఫేల్ డీల్‌పై రాహుల్ చేసిన కామెంట్స్‌కు లేఖ ద్వారా కూడా స్పందించారు.



