రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తీ : షిండే

ఢిల్లీ : ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తే చర్యలు చేపడుతున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి పై ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు. పోలీసు స్టేషన్లలో మహిళ సహాయకేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.మహిళలపై భద్రత చర్యలకు సంబంధించి ఎన్జీవోలు, మాజీ సైనికుల సేవలు వినియోగించుకుంటామన్నారు. నక్సల్స్‌ తమ దాడి వ్యూహాలను తరచూ మారుస్తున్నారని, ఎలాంటి దాడులనైనా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని షిండే అన్నారు. పాఠశాల, కళాశాలలు పూర్తయిన తర్వాత విద్యార్థులు నేరుగా ఇంటికి వెళ్లాని ఆయన సూచించారు. తెలంగాణపై నిర్ణయానికి నెల గడువడిగానని, 28 వరకు సమయం ఉందని ఆయన చెప్పారు. ఈ అంశంపై చాలామంది నుంచి సమాచారం వస్తోందని, తాను కూడా వివరాలు తెలుసుకుంటున్నానని, అందిన సమాచారాన్ని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతొందని షిండే తెలియజేశారు.