రాఫెల్‌ డీల్‌తో రూ.41,000 కోట్ల నష్టం

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి
పాండిచ్చేరి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కార్‌ పనితీరుని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి తప్పుపట్టారు. రక్షణ ఉత్పత్తుల సేకరణ నిబంధనలను పాటించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. సోమవారం విూడియాతో ఆయన మాట్లాడుతూ, రక్షణ ఒప్పందాల విషయంలో సహజంగా చాలా విస్తృతంగా చర్చించి, ఆచితూచి వ్యవహరిస్తూ అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన విధివిధానాలనాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రధాని వీటికి పక్కనబెట్టి ‘వ్యక్తిగత ¬దా’లో రఫేల్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కొనుగోళ్లకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భారీ కమర్షియల్స్‌ డీల్స్‌కు సంబంధించి ప్రధాని సొంత నిర్ణయం తీసుకోరాదన్నారు. మోదీ చర్య ‘నా మాటకు తిరుగులేదు’ అని ప్రకటించుకున్న 17వ శతాబ్దానికి చెదిన ఫ్రెంచ్‌ కింగ్‌ లూయిస్‌ 14ను గుర్తు చేస్తోందని విమర్శించారు. ఫ్రెంచ్‌ కంపెనీతో రాఫెల్‌ కొనుగోళ్ల ఒప్పందం ద్వారా దేశానికి రూ.41,000 కోట్లు నష్టం వచ్చిందని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం 126విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేవలం 36విమానాలను హెచ్చు ధరలకు కొనాలని నిర్ణయించిందని చెప్పారు. రాఫెల్‌ కొనుగోళ్లకు ప్రధాని తీసుకున్న ‘ఏకపక్ష’ నిర్ణయం అతిపెద్ద తప్పిదమని జైపాల్‌ తప్పుపట్టారు.