రామలక్ష్మణ పల్లి చరిత్ర _నూతన రామాలయ గుడి మహోత్సవం

గాంధారి మార్చి జనంసాక్షి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి చరిత్ర ,ఆ గ్రామానికి రామాలయ గుడి అంటే ఒక మారుపేరు అనాదిగా వస్తున్న రాములవారి కళ్యాణం అంటే ఆ ఊరికే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క ఇంటిలో జరుపుకునే పెద్ద పండుగ శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున జరుపుకుంటారు 1955 లో ఆ ఊరికి వాగు అవతల చిన్న (కానుగు మర్రి) వృక్షం కింద వెలసిన రాములవారిని గుర్తించి ఆనాదికాలంలో ఆ గ్రామం పెద్దలు ఇస్రా జువాడి రామయ్య, తనతో పాటు కమ్మరి సత్తయ్య ,గడ్డమీది కిష్టయ్య, కాట్రోత్ వాసు రామ్, కొండని కొండయ్య, ఎర్ర శివయ్య, దేమే రాజమౌళి, దాదాపుగా 55 సంవత్సరాల క్రిందట 1955లో గ్రామంలో రాములవారి విగ్రహాలను స్థాపించారు అప్పటినుండి ఊరు పేరు రామలక్ష్మణ పల్లి అని పిలుచుకున్నారు
( 2023 నూతన రామాలయ గుడి)
__________
నూతన రామాలయ గుడి పనులు సుమారుగా రెండు సంవత్సరాలు గా వస్తుంది ఆ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త రామ్ చందర్ కల ఈ సంవత్సరం నెరబోతుంది అని పలువురితో మురిసిపోతూ వెల్లువొంచుకుంటున్నారు గ్రామ ప్రజల సహకారంతో ఒకరిద్దరి కల కాదు ఇది మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతగా నేనున్నా అంటూ ప్రతి ఒక్క పౌరుడు ముఖ్యంగా యువకులు ముందుండి నడపడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదంటూ అన్నారు మాకు తోడు రామభక్తులు ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర లేవు అనకుండా వాళ్లు ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారు కొంతమంది అడగకుండా మరీ హార్దిక సహాయం అందజేశారని అన్నారు ఈ సంవత్సరం శ్రీరామనవమి వరకు పూర్తి చేసుకుంటామని అన్నారు మరియు రాముల కళ్యాణం మహోత్సవం వరకు ముగించుకుంటే రామలక్ష్మణ పల్లి గ్రామానికి ముఖ్యమైన పండగగా కొలుచుకునే శ్రీరామనవమి రోజు మరియు వివిధ మండలాల నుండి జిల్లాల నుండి మల్ల యోధులు పెద్ద ఎత్తున వచ్చి కుస్తీలలో పాల్గొని పండగకి మరింత జీవం పోసి విజయోత్సవంలో పాల్గొంటారని అన్నారు