రామలింగరాజు జైలుకు
-ఖైదీ నం.4148
-ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5 కోట్ల భారీ జరిమానా
-తీర్పునిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం
హైదారబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి):
సత్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న రామలింగరాజుతో పాటు పదిమంది దోషులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే భారీగా జరిమానా కూడా విధించింది. తుది తీర్పు వెలువరించి నిందితులను దోషులుగా నిర్దారించిన ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం దోషులకు శిక్ష ఖరారు చేసింది. కేసులో ప్రధాన నిందితులు రామలింగరాజు, రామరాజులకు జైలుతో రూ. 5 కోట్లు చొప్పున జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామలింగరాజు సహా దోషులందరినీ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో కోర్టు తీవ్ర అభియోగాలు చేసింది. కార్పోరేట్ రంగంపై దుష్పభ్రావం చూపిందని వ్యాఖ్యానించింది. సీబీఐ దాఖలు చేసిన మూడు అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రామలింగరాజు, రామరాజులకు 7 సంవత్సరాల శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించింది. సుదీర్ఘ వాదనల అనంతరం రాజుతో పాటు మరో 10 మంది నిందితులు ఆర్థిక నేరానికి పాల్పడింది వాస్తవమేనని సీబీఐ దర్యాప్తులో తేలినందున కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన మరో ఎనిమిది మంది వడ్లమాని శ్రీనివాస్, తూళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణరాజు, గోపాలకృష్ణన్, ప్రభాకర్‌గుప్తా, శ్రీశైలం, వెంకటపతిరాజులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 25లక్షల రూపాయల జరిమానా విధించింది. మదుపుదారుల నష్టంతో కలిపి సుమారు 14వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. రామలింగరాజుతో పాటు ఇతర నిందితులు ఈ కుంభకోణం ద్వారా సుమారు 2743 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాధించినట్లు సీబీఐ నిర్ధారించింది. ఇప్పటికే రామలింగరాజు 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. దోషులను చర్లపల్లి జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణకోసం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా బీపీఎల్‌ఎన్ చక్రవర్తి నియామకం అయ్యారు. సుమారు 33 నెలల జైలు జీవితం అనంతరం 2011 నవంబర్ 4 సత్యం రాజుకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు అయ్యింది. ఈ కేసులో మొత్తం 226 మందిని సీబీఐ విచారించింది. ఇందులో 14 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేల్చింది. సత్యం రాజు, ఇతర దోషులు మొత్తం 2743 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు కోర్టు నిర్దారించింది.
కార్పోరేట్ రంగంపై దుష్పభ్రావం చూపిన కేసుమదుపుదారులకు నష్టం కలిగించే కుట్రతో జరిగిన ఆర్థిక నేరంగా సత్యం కుంభకోణంను ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. దేశ ఆర్థిక, కార్పొరేట్ వ్యవస్థలపై తీవ్ర దుష్పభ్రావం చూపిన నేరంగా కోర్టు పరిగణించింది. మొత్తం 3,038 పత్రాలు పరిశీలించిన సీబీఐ 216 మందిని విచారించింది. సత్యం కేసులో 3 అభియోగపత్రాలు దాఖలు చేసిన సీబీఐ ఏ1 రామలింగరాజు, ఏ2- రామారాజు, ఏ3-వడ్లమాని శ్రీనివాస్, ఏ4-గోపాలకృష్ణన్, ఏ5-తాళ్లూరి శ్రీనివాస్, ఏ6-సూర్య నారాయణరాజు, ఏ7-జి.రామకృష్ణ, ఏ8-వెంకటపతిరాజు, ఏ9-శ్రీళైలం, ఏ10-వీఎస్‌పీ గుప్తా గా పేర్కొంది. ఐపీసీ 120బి, 420, 409, 419, 467, 471, 477ఏ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు. చర్చొపచర్చలు, సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం నిందితులందరిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానం 973 పేజీల్లో తీర్పును నేడు వెలువరించింది. వీరికి ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది. ఇప్పటికే 33 నెలలు జైలులో ఉన్నందున మిగతా కాలానికి శిక్ష అనుభవించారు. విరిని సాధారణ ఖైదులుగానే పరిగణించాలని కోర్టు పేర్కోంది నిందుతుల్ని చర్లపల్లి జైలుకు తరలించారు. రామలింగరాజుకు ఖైదీనెం 4148గా కేటాయించారు.