రామస్వామి స్ఫూర్తితో సమాజ సేవకు అంకితం కావాలి: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్
గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): దివంగత సిపిఐ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు వేషాల రామస్వామి స్ఫూర్తితో ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త సమాజ సేవకు అంకితం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ ఉద్భోదించారు.ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో జరిగిన వేషాల రామస్వామి ప్రధమ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ సాధన పోరాటం వరకు రామస్వామి అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని రామస్వామి జీవితం ఆద్యంతం ఆదర్శనీయమని రామస్వామి బాటలో నేటి యువ కమ్యూనిస్టులు పయనించాలని ఆయన కోరారు.దేశంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్య చిచ్చులు పెట్టి మైనారిటీ మతస్తులపై దౌర్జన్య కాండ నిర్వహిస్తున్నారని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తూ దేశ రైతాంగాన్ని దివాలా తీస్తున్నారని రైతు పండించిన పంటకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు తిరగబడుతున్నారని ఈ దేశంలో బిజెపి ఓడించాలంటే దేశంలోని రైతు సంఘాలన్ని ఒక తాటిపైకి వస్తే బిజెపి మహమ్మారిని అధికారం నుంచి తొలగించవచ్చని మతోన్మాదుల ఆట కట్టించడమే రామస్వామికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు.
సభకు బిల్లా కనకయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, ధూళిపాళ ధనుంజయ నాయుడు, కంబాల శ్రీనివాస్ సిపిఐ జిల్లా సమితి సభ్యుడు త్రిపురం సుధాకర్ రెడ్డి,ఏ ఐ వై ఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చిలక రాజు శ్రీను, సిపిఎం నాయకుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area