రాష్ట్రంలో రాక్షస పాలన

` కెసిఆర్‌ కుటుంబ పదవులు అనుభవిస్తుంది
` రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది
` కాలేశ్వరంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం
` ఏడాదిలోనే మేడిగడ్డ వద్ద బ్రిడ్జి పొంగిపోయింది
` ఎల్లారెడ్డి సకలజనుల విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి నితీష్‌ గడ్కారీ
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని కెసిఆర్‌ కుటుంబ పదవులు అనుభవిస్తుందని కేంద్రమంత్రి నితీష్‌ గడ్కరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్ర మంత్రి నితీష్‌ గడ్కారీ  విమర్శించారు . తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రివర్యులు నితీష్‌ గడ్కారీ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి చర్చి కాంపౌండ్‌ లో ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభకు కేంద్ర మంత్రివర్యులు నితీష్‌ గడ్కరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.  కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. నిర్మించిన ఏడాదిలోని మేడిగడ్డ వద్ద బ్రిడ్జి పొంగిపోయిందని ప్రజాధనం మట్టిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంతకుముందు తాను కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. కానీ కాలేశ్వరం ను డిజైన్‌ కేసీఆర్‌ మాత్రమే డిజన్‌ చేశారని తప్పుడు డిజైన్‌ చేయడం వల్ల తప్పిదం వల్ల ప్రాజెక్టు కూలిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో చదువుకున్న యువతకు నైపుణ్యమిస్తే ఉమ్మడి నిజామాబాద్‌ అభివృద్ధి చెందుతుంది కానీ దౌర్భాగ్యం పరిస్థితి వల్ల సీఎం కేసీఆర్‌ వల్లే ఎంతో మంది నిరుద్యోగులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేసిఆర్‌ తన కుటుంబం పై ఉన్న ధ్యాస తెలంగాణ నిరుద్యోగుపై లేదన్నారు.ఎల్లారెడ్డిలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డిని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎల్లారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. మెదక్‌ ఎల్లారెడ్డి రుద్రూర్‌ వరకు 900 కోట్లతో రోడ్డు నిర్మాణం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగులు అనేకమంది ఉన్నారని ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమలు లేవన్నారు. తెలంగాణలో అధికారం వస్తే ఈ ప్రాంతంలో విత్తన ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రోడ్ల సమస్యలు బాగా ఉన్నాయని ఎల్లారెడ్డి ప్రజలు బిజెపికి ఆశీర్వదించి సుభాష్‌ రెడ్డిని గెలిపిస్తే రోడ్ల విషయంలో సుభాష్‌ రెడ్డి అడిగిన అన్ని పనులను కేంద్ర నిధులతో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన విధులతోనే భారాస సర్కార్‌ పథకాలు చేపట్టిందని కేంద్ర రాష్ట్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రివర్యులు పేర్కొన్నారు. అంతేకానీ పథకాల్లో రాష్ట్ర నిధులు సూన్యమన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించింది ఎరువులకు సబ్సిడీ ఇచ్చిన ఘనత మోడీదేనాని కొనియాడారు. తెలంగాణలో అన్ని రేట్లు ఎక్కువయినని విమర్శించారు. దేవాలయ భూములను అన్యకాంతం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చిన ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతులను ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయకుండా పేదలకు కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారులకు రాగానే ఫజల్‌ భీమా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అంటే కుటుంబ పాలనాని గడ్కారీ విమర్శించారు. తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఇది ఎక్కడి సాంప్రదాయమని మండిపడ్డారు. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం యువత బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి తన కుటుంబ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. ఇది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలు కుటుంబ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం నుంచి సీఎం కొడుకు కావాలని, మంత్రి నుంచి మంత్రి కొడుకు కావాలని ఇలా కుటుంబం కుటుంబం పాలన కొనసాగుతుందని ఎద్దేవ చేశారు. దేశంలోనే ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజన కోసం పాలిస్తుండగా బిజెపి మాత్రం దేశం కోసం పాలన సాగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణలో పండిరచిన వరి ధాన్యం క్వింటాల్‌ కు 3100 కనీసం మద్దతు ధరతో సేకరిస్తామన్నారు. చిన్న సన్న కారు రైతులకు ఎరువుల విత్తనాల కొనుగోలు కోసం 2500 రూపాయలు కేటాయిస్తామన్నారు. మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీతోనే రుణాలు. అరులైన పేదలకు గ్రామాల్లో ఇంటి పట్టాల పంపిణీ. అరులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డుల పంపిణీ. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ. పేదలకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేస్తాయి వైద్యం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల సలహాదారలు వేదిరే శ్రీరామ్‌, జిల్లా ఇంచార్జ్‌ ఎర్రం  మహేష్‌ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, డా.మర్రి రాం రెడ్డి, అసెంబ్లీ ఇంచార్జ్‌ సుభాష్‌ మాలిక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ రవి గౌడ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ లింగరావు, ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్‌ దేవేందర్‌, సీనియర్‌ నాయకులు బాలకిషన్‌, వైస్‌ ఎంపిపి పెడ్డెడ్ల నర్సింలు, శ్రీనివాస్‌ రెడ్డి , హఫీజ్‌ పటేల్‌, యునిస్‌, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.